ప్రజాపాలన జనరంజకమేనా!
డా.తిరునహరి శేషు :
తెలంగాణ(Telangana) ఏర్పాటైన తరువాత 2023లో మూడో పర్యాయం జరిగిన శాసనసభ ఎన్నికల(Legislative Assembly Elections)లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ(Congress Part) అధికారంలో కి వచ్చిన వెయ్యి రోజులు పూర్తి చేసుకు న్నది. రాజ్యాంగం ప్రకారంగా ఒక ఎన్నికైన ప్రభుత్వానికి 18 వందల రోజుల సమ యం ఉంటుంది. ఇక మిగిలిన 800 రోజులలో చివరి 180 రోజులు కేర్ టేకర్ గవర్న మెంట్‌గా ప్రభుత్వం పనిచేస్తే మిగతా 620 రోజులు, అంటే 21 నెలలలో ప్రభు త్వం నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించాలి.
ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చి న హామీలను(Promises) నెరవేర్చాలి. అప్పుడే ముఖ్యమంత్రి(Chief Minister) చెబుతున్నట్లుగా 2034 వరకు ఈ కాంగ్రెస్సే అధికారంలో కొనసాగే అవకాశాలు ఉంటాయి. రేవంత్ తన వెయ్యి రో జుల పాలనా మైలురాయిని దాటిన తరువాత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం హామీలను, గ్యారెంటీల(Guarantees)ను ఎంత మేరకు అమలు చేసింది? రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఎంత? ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, కార్యక్రమాలు పట్ల ఏ వర్గాలు సం తృప్తిగా ఉన్నాయి? అలాగే కొండా సురేఖ బర్తరఫ్(Konda Surekha dismissa) తరువాత జరుగుతున్న పరిణామాలు, మంత్రివర్గ విస్తరణ(cabinet expansion) ఊహాగానాల పై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలలో విస్తృతమైన చర్చ జరుగుతున్నది.
రేవంత్ ప్రభుత్వం వెయ్యి రోజులలో ఏమి చేయలేదని అనలేం, అంతా బాగుందని కూడా చె ప్పలేం. ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షాలు సహజంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తాయి. పాలకపక్షం సంతృప్తి వ్యక్తం చేస్తుంది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని ఒక ప్రభుత్వ పనితీరుని అంచనా వేయగలుగుతాం.
రాష్ట్ర ఏర్పాటు తరువాత కొనసాగిన దశాబ్దపు పాలనపై అసంతృప్తిగా ఉన్న ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడం, ఆ అంచనాలను చేరుకునే విధంగా కాంగ్రెస్ పాలన లేకపోవటం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చకపోవడంతో సహజంగానే కొన్ని వర్గాలలో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
గత ప్రభుత్వానికి భిన్నంగా రేవంత్ సర్కార్ అభివృద్ధి- సంక్షేమం విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సంక్షేమ ఎజెండా. దానికి అనుగుణంగానే రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్‌లో లక్ష కోట్ల రూపాయలు సంక్షేమంపైనే ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలు, వర్గాల వారీగా రూపొందించిన డిక్లరేషన్లు ఉపయోగపడ్డాయి.
కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలు విషయంలో ప్రభుత్వం ప్రజలలో విశ్వాసాన్ని కల్పించలేకపోయింది. సన్న బియ్యం, ఉచిత బస్, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, రేషన్ కార్డులు లాంటి సంక్షేమ పథ కాలు, కార్యక్రమాలు చేపట్టినా పెన్షన్ల పెంపు (45 లక్షల మంది లబ్ధిదారులు), రైతు భరోసా పెంపు (70 లక్షలు) మహాలక్ష్మి ప థకంలో భాగంగా మహిళలకి నెలకి రూ.2500 (50 లక్షలు) లాంటి పథకాల ను అమలు చేయకపోవడం వల్ల విపక్షాలకి విమర్శనాస్త్రాలుగా మారాయి.
లబ్ధిదారులూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏపీ లో 2024లో చంద్రబాబు అధికారంలోకి రాగానే పెన్షన్ రూ.4 వేలకు పెంచి, ప్రతినెలా పెన్షన్ పంపిణీ ఒక ప్రభుత్వ కార్యక్ర మంలాగా నిర్వహించి ఇతర హామీలు నెరవేర్చకపోయినా ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మహిళలకి ఉచిత బస్సు ద్వారా కలిగే లబ్ధి కంటే నెలకి రూ.2500 ఆర్థిక సహాయంతో ఎ క్కువ ప్రయోజనం కలుగుతుందని మహిళలు భావిస్తున్నారు.
కాబట్టే పథకాల అమ లులో ప్రభుత్వ చిత్తశుద్ధిని లబ్ధిదారులు అనుమానిస్తున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులతోనే ప్రభుత్వం కీలక హామీలను అమలు చేయకుండా కుట్టు మిషన్ల పంపి ణీ లాంటి పథకాలతో నెట్టికొస్తున్నారనే విషయాన్ని ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.
రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ పేరిట మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చే యాలనే ప్రణాళికలు, పెట్టుబడుల ఆకర్షణ కోసం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులు, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్, మూసీ ప్రక్షాళన, మెట్రో రెండవ దశ విస్తరణ లాంటి అభివృద్ధి కా ర్యక్రమాలు బాగున్నా, వీటి ద్వారా చేకూరే అభివృద్ధి ఫలాలు ఇంకా ప్రజలకి చేరకపోవడంతో ప్రజల నుంచి ఆశించిన మద్దతు దక్కటం లేదు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర ఆదాయం పెరగకపోవటంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సర్కార్ పెద్ద ఎత్తున చేయలేకపోతున్నది. ఇవి రాబోయే ఎన్నికలలో ఎంతవరకు ఓట్లు రాల్చగలవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ మొదటి రెండు సంవత్సరాల పాలన ప్రజలలో కొన్ని ఆశలు కల్పిం చిన మాట వాస్తవం. కానీ మూడో వసంతంలోకి అడుగుపెట్టిన తరువాత మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, ప్రభుత్వం చేస్తున్న అప్పులతో పాటు, కొం డా సురేఖ వ్యవహారం పార్టీ ప్రతిష్టను దె బ్బతీసిందనే చెప్పాలి.
ప్రభుత్వ అధినేత పట్టువిడుపులతో వ్యవహరించకుండా ప ట్టుదలకు పోయి కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించటంతో తాత్కాలికం గా రేవంత్ పార్టీలో, ప్రభుత్వంలో బలమైన నేతగా కనిపించవచ్చు. కానీ, బర్తరఫ్ సందర్భంగా సురేఖ లేవనెత్తిన అంశాలు, ముఖ్యంగా సుష్మిత పటేల్ చేసిన ఆరోపణలు, అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనే అంశం భవిష్యత్తులో రేవంత్ రెడ్డిని మరిం త చికాకు పరచవచ్చు. పార్టీలో మరింత చర్చకు దారితీయవచ్చు.
కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించిన తర్వాత బలహీనవర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా ముగ్గురు బీసీ మహిళలకి ప్రాధాన్యత గల నామినేటెడ్ పోస్టు లు కట్టబెట్టారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్ర భుత్వం వ్యూహాత్మక తప్పిదం చేసింది. నామినేటెడ్ పదవులు పొందిన ముగ్గురు మహిళలలో బీఆర్‌ఎస్ నుంచి మేయర్లుగా ఎంపికై, ప్రభుత్వం మారిన తరువాత బీఆర్‌ఎస్‌ని మాత్రమే వదిలి పదవులను వద లకుండా కాంగ్రెస్‌లో చేరి ఇప్పుడు మళ్లీ ఇక్కడా పదవులు పొందడంతో అచ్చ కాంగ్రెస్‌లో ఈ నియామకాల పట్ల పెదవి విరుపు ప్రారంభమైంది.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్టుదలకు పోయేవారు. కానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టువిడుపులతో వ్యవహరించడంతో పార్టీలో వ్యతిరేక వర్గం లేకుండా జాగ్రత్త పడ్డారు. కానీ కొండా సురేఖ విషయంలో రేవంత్ రెడ్డి పట్టుదలకుపోయి తన నాయకత్వాన్ని ప్రశ్నించే మరో కేంద్రాన్ని పార్టీలో తానే తయారు చేసుకున్నారు. ఇటీవల విడుదలైన సర్వేలలో రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతు న్నట్లుగానే చెబుతున్నాయి.
కానీ దళిత, మైనార్టీ, కొన్ని అగ్రవర్ణాలు కాంగ్రెస్‌కి మ ద్దతుగా నిలబడటం, ఆ పార్టీ అధికారంలో ఉండటంతో మిగతా పార్టీల కంటే కాంగ్రె స్ కొంత బలంగానే కనపడుతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణలో కాం గ్రెస్‌కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. పాలనా వైఫ ల్యాలకు బాధ్యత వహించి ప్రభుత్వ అధినేతలు రాజీనామా చేయాలని డిమాండ్ చే సిన సందర్భాలు చూశాం.
కానీ, పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా కొండా సురేఖ రాజీనామా చేయాలని, హాజరుకావటం లేదు కాబట్టి ప్రతిపక్ష నేత రాజీనామా చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే డిమాం డ్ చేయటం, ప్రతిపక్ష నేతను తీవ్ర పదజాలంతో ముఖ్యమంత్రి బహిరంగ వేదికలపై దూషించటం వల్ల కొన్ని వర్గాల్లో వితిపక్ష నేతపై సానుభూతి వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా పాలనా వైఫల్యాలపై దృష్టి కేంద్రీకరించి ఎన్నికల హామీలను అమలు చేయటానికి ప్రయత్నం చేయకపోతే గత ప్రభుత్వానికి ఎదురైన అనుభవమే ఈ ప్రభుత్వానికి కూడా తారసపడే అవకాశాలు లేకపోలేదు.
వ్యాసకర్త సెల్: 9885465877






