స్టేషన్ బెయిల్‌కు కాసుల సిరి?

18-09-2026 | 05:20am
  1. రూ. లక్షల్లో వసూలు చేస్తున్న పోలీసులు 
  2. చిన్న కేసులకు సైతం భారీగా డిమాండ్ 
  3. సామాన్యులకు అందని న్యాయం 

మేడ్చల్, సెప్టెంబర్ 17(విజయ క్రాంతి): స్టేషన్ బెయిలు కేసులు పోలీసు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. చిన్న కేసులే అయినా పోలీస్ అధికారులు (Police officers) ప్రజలను భ యపెట్టి భారీగా దండుకుంటున్నారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు పోలీస్ స్టేషన్ (Police station)లోనే బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ బెయిల్ ఇవ్వడానికి పోలీసు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. కోర్టులో పని భారం తగ్గించడానికి, సామాన్యులకు సౌలభ్యంగా ఉంటుందని ఉద్దేశంతో స్టేషన్ బెయి ల్ ను తీసుకువచ్చారు.

కానీ ప్రజలు చిన్న కేసు అయినా పెద్ద మొత్తంలో ఖర్చు చేయా ల్సి వస్తోంది. వాస్త వానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పోలీసులు 41 ఏ (35 బి ఎన్ ఎస్) నోటీసు ఇవ్వాలి. ఇద్దరూ షూరిటీలతో బెయిలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నిం దితులకు తొందరగా స్టేషన్ బెయిలు రావ డం లేదు. రేషన్ బియ్యం అక్రమ రవాణా కే సు నమోదైన ఒక వ్యక్తిని పోలీసు అధికారు లు రూ. 10 లక్షలు డిమాండ్ చేయడం బట్టి చూస్తే స్టేషన్ బెయిలు ఎంత కాసులు కురిపిస్తుందో అర్థం అవుతోంది.

కీసరలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని రూ. 10 లక్షలు డిమాండ్ చేయగా, రూ. 5 లక్షలకు ఒప్పందం కుదిరింది. చివరకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చి క్కారు. మేడ్చల్ జిల్లాలో ఇలాంటి కేసులు గ తంలో కూడా జరిగాయి. షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో 2025 ఏప్రిల్ లో స్టేషన్ బెయిల్ ఇ వ్వడానికి రూ. రెండు లక్షలు డిమాం డ్ చేశారు. రూ.2.42 లక్షల విలువ చేసే నూనె డబ్బాలు చో రీ చేసిన నిందితుల నుంచి కొనుగోలు చేసిన వ్యక్తిని కేసు నుంచి తప్పించేందుకు రూ. రెండు లక్షలు డిమాండ్ చేశారు.

బాధితుడు ఈ డబ్బును చెల్లించాడు. అయినప్ప టికీ అదనంగా మరో రూ. 25000 ఇవ్వాలని ఎస్త్స్ర డిమాండ్ చేశారు. రూ. 22 వేలకు బేరం కుదుర్చుకొని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. స్టేషన్లో ఈ డ బ్బును ఎస్త్స్ర చెత్త డబ్బాలో వేయించుకోగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్లోనూ స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకుంటూ ఏఎస్‌ఐ ఏసీబీకి దొరికారు. 

అవగాహన లేకపోవడంతోనే.....

చట్టం మీద సరైన అవగాహన లేకపోవ డం వల్ల పోలీసులకు అడిగినంత లంచం ఇ చ్చి బయటపడుతున్నారు. స్టేషన్ బెయిల్లేబు ల్ అంటేనే చిన్న కేసు. దీనికి పెద్దగా భ యపడాల్సిన అవసరం లేదు. కానీ పోలీసులు భయపెడుతున్నారు. డబ్బు లేని పేదవాడు అయితే వారంలో బెయిల్ ఇవ్వకపోతే అ తడిని పేదవాడిగా భావించి బాం డ్, ప్యూరిటీలు లేకుండానే వదిలేయాలి.

పేకాట, కొట్టుకోవడం, చిన్నచి న్న చీటింగ్, పరువు నష్టం, బెదిరింపులు, ట్రాఫిక్, పబ్లిక్ న్యూసెన్స్ వంటివి స్టేషన్ బెయిలబుల్ కేసులు. ఏడేళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న హత్య, దోపిడి, అత్యాచారం, పెద్ద మోసం వంటి కేసులకు స్టేషన్ బెయిలు రాదు. కోర్టులోనే బెయిల్ తీసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు