ఇది శాసన సభనా.. లేక కౌరవ సభనా?

08-09-2026 | 05:20am
  1. మహిళా ఎమ్మెల్యేల చీరెలు లాగుతారా?
  2. ఎమ్మెల్యేలను మెడ పట్టి గెంటేస్తారా..
  3. ఇదేం రాజ్యం రేవంత్‌రెడ్డి.. పోలీసు రాజ్యం నడుపుతున్నావా?
  4. అసెంబ్లీ చరిత్రలో ఇదొక బ్లాక్ డే
  5. తెలంగాణ భవన్ వద్ద మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణ(Telangana)లో ఉన్నది శాసన సభనా(Legislative Assembly) లేక కౌరవ సభనా.. మహిళా శాసన సభ్యుల(Women legislators) చీరెలను లాగుతారా అని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధుల(Public representatives)పై పోలీసులను ప్రయోగిస్తారా, ఎమ్మెల్యేలను మెడపట్టి గెంటే స్తారా అని నిలదీశారు. ఇదేం రాజ్యం రేవంత్‌రెడ్డి(Revanth Reddy).. పోలీసు రాజ్యం నడుపుతున్నావా లేక ప్రభుత్వం నడుపుతున్నావా అని ఎద్దేవా చేశా రు. తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) చరిత్రలో ఇదొక బ్లాక్ డే(Black Day) అని, మహిళా సభ్యుల చీరెలు లాగిన పోలీసుల(Polices)ను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

ప్రజల సమస్యలపై చర్చ అంటే ప్రభుత్వం ఎందుకు పారిపోతున్నదిని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల గురించి ‘అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడకుండా గొంతు నొక్కారు’ అని విమర్శించారు. వెయ్యి రోజుల విఫల పాలన వాస్తవాలు బట్ట బయలు అవుతాయ ని భయపడ్డారని, అందుకే తమపై పోలీసులను ప్రయోగించి, అమానుషంగా, అమానవీయంగా సభ్యుల పట్ల ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మహిళా శాసనసభా నాయకుల చీరెలు లాగుతారా? మా పట్ల దుర్మార్గం గా ప్రవర్తిస్తారా?, మా మహిళా సభ్యుల చీరెలు లాగిన పోలీసులను వదిలిపెట్టబోం’ అని హెచ్చరించారు. సునీతమ్మ చీర లాగిన పోలీసులను, సబితమ్మ గొంతు నొక్కిన పోలీసులను, జగదీష్‌రెడ్డిని కింద పడేసిన వారినైనా సరే.. సప్త సముద్రాల అవల ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఆసుపత్రికి కూడా తీసుకు వెళ్లకుండా అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు.

కేటీఆర్‌కు చేయి గీరుకుపోయింది, ముఖం మీద గీరుకు పోయిందని, యాదవరెడ్డికి కుడికాలు గోరు పోయింది, రాజశేఖరెడ్డి కాలు కమిలిపోయింది, సంజయ్ చేయికి దెబ్బ తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘హోంమంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి నువ్వు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని 22ఏ మీద, ఫీజు రీయంబర్స్‌మెంట్ మీద నామమాత్రపు చర్చ చేస్తారా? ప్రధాన ప్రతిపక్షం వద్దా అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక నల్ల టీ షర్ట్స్ వేసుకొని పార్లమెంట్‌కు వెళ్లారని, ఇక్కడ ఎం దుకు అడ్డుకుంటారని నిలదీశారు. ‘మేము ప్రజల తరుఫున నిరసన తెలుపుతుంటే అడ్డుకుంటున్నారు. రేవంత్ రెడ్డి లాగా మేము బడివే అనలేదు, పైల్వాన్లు ఉన్నరు కొడుతరు అనలేదు. మేం మీ వైఫల్యాల గురించి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్నాం’ అని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా చర్చ జరుపుతాం అంటే ఈ ప్రభుత్వం పారిపోయినట్లే, తప్పు చేసినట్టే అని విమర్శించారు. ‘మీరు తప్పు చేయకుంటే ఎందుకు ఎజెండా లో పెట్టడం లేదు.

మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు. విద్యార్థు లు రోడ్ల మీద ఎక్కి ధర్నాలు ఎందకు చేస్తున్నారు’ అని నిలదీశారు. ‘మమ్మల్ని సస్పెండ్ చేయడానికి ఒక వ్యూహం’ ప్రకారం నడుచుకున్నారని, ఎన్ని కుట్రలు చేసినా 22ఏ, ఫీజు రీయింబర్స్ మెంట్ వైఫల్యాల గురించి వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

స్కాంలు, వైఫల్యాలు బయట పడుతాయని ఇదంతా చేశార ని, తొక ముడిచి పథకం ప్రకారం కుట్ర పన్నారని ఆరోపించారు. ‘మా చెల్లమ్మ గొంతు నొక్కి తే చూస్తూ ఊరుకుంటారా?, ఒక అక్క గొంతు పిసికితే చేతులు కట్టుకొని చూస్తూ ఉండాలా అని ప్రశ్నించారు. ఇదేం ప్రజాస్వామ్యం?.. ఇది పోలీసు రాజ్యమా అని నిలదీశారు. ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు