సగంలో ఆగిపోయింది..!
నిలిచిపోయిన కమ్యూనిటీ హల్ నిర్మాణం.. నాలుగేళ్ల క్రితం శంకుస్థాపన
- నిధులు సరిపోనందున నిలిచిపోయిన నిర్మాణం
- కమ్యూనిటీ హాల్ పూర్తయితే ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్న అధికారులు
- తొందరగా పూర్తి చేసి ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కోరుతున్న స్థానికులు
కూకట్ పల్లి, సెప్టెంబర్5, ( విజయ క్రాంతి): మూసాపేట సర్కిల్(Moosapet Circle) పరిధి ప్రశాంత్ నగర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి(Community hall construction) శంకుస్థాపన(Foundation Stone Laying) చేసి నిర్మాణ పనులను నిధులు కొరత పేరుతో నిలిచిపోయింది.2022 జూన్ 29 రూ. 50 లక్షలతో భవన నిర్మాణం చేపట్టాలని శంకుస్థాపన చేసిన అధికారులు(officials), నాయకులు(leaders) నిధులు కేటాయించడంలో మాత్రం నిర్లక్ష్యం వహించడం కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఆగిపోయింది. తూతూ మంత్రంగా కేటాయించిన కొద్దిపాటి నిధులతో నిర్మాణానికి పునాదులు వేసి వదిలేశారు.
కమ్యూనిటీ హాల్ నిర్మాణం(Community hall construction) అయితే స్థానికంగా ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఎదురుచూస్తున్న స్థానికు నిరాశే మిగులుతుంది. కమ్యూనిటీ హాల్ నిర్మాణం అయితే అందులో కొంత భాగాన్ని ఆసుపత్రికి కేటాయిస్తామని నాయకులు హామీ ఇవ్వడంతో స్థానిక ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కమ్యూనిటీ హాల్ పునాది స్థాయిలోనే ఆగిపోవడంతో స్థానికంగా ఆసుపత్రి వస్తుందన్న ఆశలతో స్థానికులు ఎదురుచూస్తున్న ఆశలు ఇప్పటివరకు నెరవేరకపోవడంతో ఎప్పుడు పూర్తవుతుందో అని ఆశతో ఎదురుచూస్తున్నారు.
ప్రారంభించి నాలుగు సంవత్సరాలు కావడంతో పిల్లర్లకు వాడిన ఇనుపచువ్వలు ఎండకు ఎండి వానకు నాని తుప్పు పట్టి పోతున్నాయి. స్థానిక అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిర్లక్ష్యానికి గురవుతుందనే వాదన ప్రజలలో బలంగా వినిపిస్తుంది. కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టవలసిన స్థలంలో స్థానిక పరిశ్రమల వాహనాలను పార్కింగ్ నిమిత్తం ఉపయోగించుకుంటున్నారు.
స్థానిక కాలనీవాసులు పలు పార్టీల నాయకులు కమ్యూనిటీ హాల్, ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని ఎన్నోసార్లు జోనల్ కమిషనర్ కు, డిప్యూటీ కమిషనర్ కు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలో ఆసుపత్రి నిర్మాణం జరిగితే తమకు దూర ప్రాంతంలో ఉన్న ఆస్పత్రికి పోవాల్సిన అవసరం ఉండదని త్వరగా ఆసుపత్రి నిర్మిస్తే ఎంతోమంది వృద్ధులకు, రోగులకు ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
* శంకుస్థాపన చేసిన సమయంలో కేటాయించిన నిధులతో కమ్యూనిటీ హాల్ ను కొంతవరకు నిర్మాణం ప్రారంభించారు. అప్పుడు కేటాయించిన నిధు లతో నిర్మాణ పనులను పూర్తి చేశాం. క మ్యూనిటీ హాల్ నిర్మాణపనులు ముం దుకు సాగడానికి టెండర్ ప్రక్రియ కొనసాగిస్తున్నాం. త్వరలోనే పనులను ప్రారంభిస్తాం.
శ్రీనివాస్ ఏ.ఈ. మూసాపేట సర్కిల్
* గతంలో ఎన్నోసార్లు కమ్యూనిటీ హా ల్ నిర్మాణం కోసం స్థా నిక అధికారులకు, జోనల్ కమిషనర్‌కు వినతి పత్రాలు అందజేశాం. ఏ అధికారి స్పం దించడం లేదు, నిధుల కొరతతో ప్రారంభించి నిలిపివేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళా ము. స్థానికంగా ఆసుపత్రి నిర్మాణం జరిగినట్లయితే పేదలకు ఎంతో ఉపయో గకరంగా ఉంటుంది.
కృష్ణ. సీపీఐ నాయకుడు






