జైలర్ 2 రాగాలు
19-08-2026 12:00 AM
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజాచిత్రం ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 2023లో వచ్చిన ‘జైలర్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు సంబంధించి మ్యూజికల్ ప్రమోషన్స్‌కు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా తెర తీసింది. ఈ సినిమా నుంచి తొలిగీతం విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
ఈ ఫస్ట్ సింగిల్ ఆగస్టు 21వ తేదీన విడుదల కానున్నట్టు వెల్లడించింది. అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ పోస్ట్-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. అనిరుధ్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ కాగా, నిర్మల్ ఎడిటర్.






