టిఆర్ఎస్ పార్టీలో చేరిన జలాల్పూర్ గ్రామస్తులు
18-08-2026 10:39 AM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని జలాల్పూర్ గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాగారెడ్డి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. సుమారు 50 మంది గ్రామస్తులు టిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు బాగారెడ్డి, మండల కార్యదర్శి ఖలీల్, మైనార్టీ నాయకులు ఏజాస్, మండల యూత్ అధ్యక్షులు పాహీం, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీను,ప్రభాకర్, మాణిక్యం, భూమయ్య, సాయిలు, కుమార్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.






