ప్రాణాలకు ఉచ్చుగా మారిన డివైడర్లు!

06-10-2026 | 05:05am
  1. యూటర్న్ వద్ద కనిపించని వాహనాలు..
  2. నిత్యం ప్రమాదాలు

జనగామ, అక్టోబర్ 5 (విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon District) కేంద్రంలో ప్రధాన రహదారులపై ఉన్న డివైడర్లు వాహనదారుల(Dividers for motorists) ప్రాణాలకు ఉచ్చుగా మారాయి. డివైడర్ల మధ్య 5 అడుగులకు పైగా ఏపుగా పెరిగిన చెట్లు, పొదల కారణంగా యూ-టర్న్(U-Turn) తీసుకునే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్-వరంగల్ నేషనల్ హైవే(Hyderabad-Warangal National Highway), సిద్దిపేట రోడ్డు, సూర్యాపేట రోడ్డు, బస్టాండ్ ఏరియాలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రధాన రహదారిపై దూసుకొస్తున్న బస్సులు, లారీలు యూ-టర్న్ వద్ద ఆగిన వాహనదారులకు కనిపించక ఎదురెదురుగా ఢీకొంటున్నాయి.

సాయంత్రం, రాత్రి వేళల్లో స్ట్రీట్ లైట్ల వెలుతురు కూడా పొదల కారణంగా రోడ్డుపై పడటం లేదని స్థానికులు వాపోతున్నారు. అందం కోసం పెంచిన మొక్కలే ఇప్పుడు ప్రాణాలను బలిగొంటున్నాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూ-టర్న్ ల వద్ద పొదలను తక్షణమే తొలగించాలని, లేనిపక్షంలో పెద్ద ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మున్సిపల్, ఆర్ అండ్ బీ అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

డివైడర్ లో పొదలు 5 అడుగులు పెరిగాయి. యూ-టర్న్ లో ఏ వాహనం వస్తుందో కనిపించట్లేదు. రోజూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తక్షణమే డివైడర్లను క్లియర్ చేయాలి. 

- ఉల్లెంగుల సందీప్ 

పట్టణ యూత్ అధ్యక్షులు

మరిన్ని వార్తలు