క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు
విబిఐటి చైర్మన్ డాక్టర్ ఎన్. గౌతమ్ రావు
ఘట్ కేసర్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) : విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు తమను వెతుక్కుంటూ వస్తాయని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాల(Vijnana Bharathi Engineering College) చైర్మన్ డాక్టర్ ఎన్. గౌతమ్ రావు అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్ పరిధి, అవుషాపూర్ లోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో విభవ-26 రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడలు నాలుగు రోజులుగా జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌతమ్ రావు సోమవారం క్రీడా పోటీలలో పాల్గొన్న క్రికెట్ జట్ల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కళాశాల చైర్మన్ గౌతమ్ రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ నరేష్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, సివిల్ హెచ్ఓడి డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.