6 September, 2026 | 8:24 AM

మిస్ వరల్డ్‌గా జోహెరీ మోలా

06-09-2026 | 05:10am

వియత్నాంలోని న్హా ట్రాంగ్‌లో శనివారం జరిగిన 73వ అంతర్జాతీయ అందాల పోటీల(International beauty pageants) గ్రాండ్ ఫైనల్లో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెరీ మోలా మిస్ వరల్డ్ 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఆమె ప్రతిష్టాత్మకమైన నీలి కిరీటాన్ని గెలుచుకున్నారు.

110 దేశాల నుంచి వచ్చిన అందెగత్తెలతో పోటీపడి జోహెరీ మోలా విజయం సాధించారు.  భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన నికితా పోర్వాల్ టాప్ 40 ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచారు. స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రేనెస్ అలబెర్న్ మొదటి రన్నరప్‌గా నిలవగా, మలేషియాకు చెందిన తానుసియా చెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు.


మరిన్ని వార్తలు