జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక కేంద్ర చట్టాన్ని తేవాలి

02-10-2026 | 06:45pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): భారతదేశంలో జర్నలిస్టుల(Journalists)కు రోజురోజుకు రక్షణ లేకుండా పోతుందని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక కేంద్ర చట్టాన్ని తేవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే- ఐజేయు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జర్నలిస్టు డిమాండ్స్ డే లో భాగంగా శుక్రవారం టి యు డబ్ల్యూ జే జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్, వివేకానంద చౌక్, మీదుగా గాంధీ చౌక్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.

అనంతరం గాంధీ చౌక్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు చాలీచాలని వేతనాలతో జీవితాలు గడుపుతున్నారని అనేక మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన వేజ్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొత్త లేబర్ కోడ్‌లలో రద్దయిన వర్కింగ్ జర్నలిస్ట్ చట్టబద్ధ హక్కులను పునరుద్ధరించాలని కోరారు.

అలాగే తెలంగాణ ప్రభుత్వం తమ ఎన్నికల హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు అందించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈకార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, టీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి అడపా సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, చంద్రకాంత్, నవీన్ గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎస్ వేణుగోపాల్, వారణాసి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు ,జర్నలిస్టులు అహ్మద్ పాషా, నరేందర్, షేక్ జమీల్, మేకల శ్రీనివాస్, సురేష్ చారి, అబ్దుల్ హన్నన్, రాధాకృష్ణ చారి, మోహన్, భాస్కరాచారి, శ్రీధర్, పోచయ్య, డోంగ్రి రవీందర్, దూడల గోపి,కృష్ణపల్లి సురేష్, రమేష్ రాథోడ్, సృజన్, నితేష్, రవి, రాజు, సయ్యద్ సోజర్, వినోద్,  జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు