జర్నలిస్టుల నిరసనతో మారుమోగిన భద్రాచలం

02-10-2026 | 05:05pm
  1. జర్నలిస్టుల భద్రత కోసం జాతీయ చట్టం తీసుకురావాలి 
  2. జర్నలిస్టులకు హెల్త్ కార్డు మంజూరు చేయాలి
  3. జర్నలిస్టు పిల్లలకు పాఠశాల ఫీజులో 50% రాయితీ కల్పించాలి
  4. జర్నలిస్టులకు పక్క గృహాలు మంజూరు చేయాలి
  5. జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై కఠినమైన శిక్షలు అమలు చేయాలి

టీయూడబ్ల్యూజే  (ఐజెయు) భద్రాచలం డివిజన్ & పట్టణ కమిటీల డిమాండ్స్*

భద్రాచలం,(విజయక్రాంతి): జర్నలిస్టులపై దాడులు, అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమం కొరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా నేడు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ (IJU) యూనియన్(Telangana Working Journalist (IJU) Union) ఆధ్వర్యంలో రాష్ట్రంలో  జిల్లాలు, నియోజకవర్గాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా భద్రాచలం డివిజన్, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు బి.వి. రమణ రెడ్డి, జిలా ఆర్గనైజింగ్ కార్యదర్శి సోమల గిరి ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అక్కడనుండి పాత మార్కెట్ వరకు జర్నలిస్టులు అందరూ ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు బి.వి. రమణ రెడ్డి, భద్రాచలం పట్టణ అధ్యక్షులు విజ్జిగిరి రాజా కిరణ్ మాట్లాడుతూ... జర్నలిస్టులకు రక్షణ కల్పించడానికి 

నూతన మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలని, పాత్రికేయుల భద్రత కోసం జాతీయచట్టం తీసుకరావాలని, రద్దు చేయబడిన వర్కింగ్ జర్నలిస్టు చట్టాల క్రింద చట్టబద్దమైన హక్కులను పున:రుద్ధ రించాలని, కొత్త వేతన మండలి ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, సొంతింటి కల కలగానే మిగిలిపోతుందని ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొని జర్నలిస్టులకు పక్క గృహాలు ఏర్పాటు చేయాలన్నారు.

అదేవిధంగా జర్నలిస్టుల పిల్లలకు పాఠశాల ఫీజులో 50% రాయితీ కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురావాలని కోరారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కమిటీ సభ్యులు బివి రమణారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి సోముల గిరిప్రసాద్, పట్టణ అధ్యక్షులు రాజా కిరణ్, కోశాధికారి నాయుడు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు ప్రభుదాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణ, ఎండి మదర్, నియోజకవర్గ కమిటీ కోశాధికారి రాము, ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ కమిటీ కార్యదర్శి జయరాం కోశాధికారి బి బాల కిరణ్, యూనియన్ జ్ఞానేందర్, జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దిలీప్ కుమార్, బాబు నాయుడు, దుమ్మగూడెం చెర్ల  నుండి వచ్చిన పలువురు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు