35 మంది జేఎల్‌లపై వేటు

06-10-2026 | 05:10am
  1. సర్టిఫికెట్లు నకిలీవని తేలడంతో డిస్మిస్
  2. ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిపై నియామకం
  3.    2023లో ఉద్యోగాల రెగ్యులరైజ్

హైదరాబాద్ /సంగారెడ్డి అక్టోబర్ 5 (విజయక్రాంతి): నకిలీ సర్టిఫికెట్లతో(Fake certificates) ప్రభుత్వ ఉద్యోగాలు(Government Jobs) పొందిన 35 మంది జూనియర్ లెక్చరర్ల(జేఎల్)పై(Junior lecturers) వేటు పడింది. సర్టిఫికెట్లపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన అధికారులు.. నకిలీవని తేలడంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ సోమవారం ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ(Department of Intermediate Education issues orders.) చేసింది. 2014కు ముందు కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న సుమారు 3,300 మందిని గత ప్రభుత్వ హయాం 2023లో రెగ్యులరైజ్ చేసింది.

వీరిలో కొందరు ఇతర రాష్ట్రాల్లోని 16కు పైగా యూనివర్సిటీల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించారు. వాటిపై ఫిర్యాదులు రావడంతో ఇంటర్‌బోర్డు అధికారులు విచారణ చేపట్టారు.  సంబంధిత విశ్వవిద్యాలయాలను సందర్శించి రికార్డులను పరిశీలించడంతో పాటు లెక్చరర్లు సమర్పించిన సర్టిఫికెట్లను ఆయా యూనివర్సిటీల వివరాలతో సరిపోల్చారు. 35 మంది సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని అధికారులు గుర్తించారు. తొలు వారికి నోటీసులు జారీ చేసి వివరణ కోరారు.

వారి సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఉద్యోగాల నుంచి తొలగించారు.  తొలగించబడిన జూనియర్ లెక్చరర్లు నిర్మల్, రాజన్న సిరిసిల్లా, నాగర్‌కర్నూల్, నిజా మాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట్, సూర్యాపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబాబాద్, కరీంనగర్, భద్రాద్రికొత్తగూడెం, వికారాబాద్, జగిత్యాల్, నల్లగొండ, ఖమ్మం, జయశంకర్‌భూపాలపలి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేసే ఆలోచనలో అధికారులు

నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన 35 మందిపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకునే ఆలోచనలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు