వాషింగ్టన్‌లో కేఏ పాల్ హవా!

25-09-2026 | 12:23pm

వాషింగ్టన్ డీసీ: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన అంతర్జాతీయ శాంతి కార్యక్రమం(KA Paul Global Peace Summit) ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రపంచ శాంతి, అంతర్జాతీయ సహకారం, యుద్ధాల ప్రభావం వంటి అంశాలపై చర్చించేందుకు వివిధ దేశాలకు చెందిన రాజకీయ, దౌత్య, సామాజిక, మత రంగాల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చారు. ఈ సందర్భంగా కేఏ పాల్ జన్మదిన వేడుకలు(KA Paul Birthday Celebrations) కూడా నిర్వహించినట్లు సమాచారం. శాంతి కోసం ఏర్పాటు చేసిన వేదికపై ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు కార్యక్రమానికి మరో ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

యుద్ధాలు, మానవతా సంక్షోభాల నేపథ్యంలో శాంతి, సంభాషణ, దౌత్య మార్గాల ప్రాధాన్యతపై సదస్సులో చర్చలు జరిగాయి. అమెరికా ప్రతినిధులు, వివిధ దేశాల రాజకీయ–దౌత్య ప్రముఖులు, విశ్వాస సంఘాలు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేఏ పాల్ శాంతి(KA Paul) ప్రయత్నాలపై కూడా చర్చ జరిగింది. దీంతో వాషింగ్టన్‌లో జరిగిన ఈ కార్యక్రమం అంతర్జాతీయ వేదికపై మరోసారి కేఏ పాల్ కార్యకలాపాలను హైలైట్ చేసిన సందర్భంగా నిలిచింది.

మరిన్ని వార్తలు