సిద్దిపేటలో ముగిసిన కబడ్డీ పోటీలు

21-09-2026 | 08:26pm

సిద్దిపేట,(విజయక్రాంతి): విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఎస్జీఎఫ్ పోటీలు(SGF Competitions) చక్కని వేదికగా నిలుస్తున్నాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి, అండర్ 19 ఎస్ జి ఎఫ్ జిల్లా చైర్మన్ రవీందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల(Siddipet Government Junior College) మైదానంలో నిర్వహించిన అండర్ 19 కబడ్డీ పోటీలు(Kabaddi competitions) సోమవారం  ముగిశాయి.

బాలికల విభాగంలో ఎం జె పి చింతమడక జట్టు ప్రథమ స్థానంలో నిలవగా ఎంజెపి వర్గల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలుర విభాగంలో మద్దూర్ మోడల్ స్కూల్ జట్టు ప్రథమ స్థానంలో, చేర్యాల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఎస్జీఎఫ్ అండర్ 19 జిల్లా కార్యదర్శి మంతెన సమ్మయ్య, స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీల,  డిఐఈఓ రవీందర్ రెడ్డిలు బహుమతులను అందించారు. కార్యక్రమంలో కబడ్డీ కోచ్ వెంకటేష్, కళాశాల స్పోర్ట్స్ ఇంచార్జ్ అశోక్, అధ్యాపకులు సుధాకర్ రెడ్డి, కనకచంద్రం, నంట శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు