హైదరాబాద్‌లో కాకా సందడి
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కాకా’. వెంకట్ కే నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై (KVN Productions banner) భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. నివేదా పేతురాజ్, సునీ ల్, గెటప్ శ్రీను ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌నకు సినీప్రియు ల నుంచి వచ్చిన స్పందన ఈ సినిమాపై అంచనాలు పెంచింది. 2027 జనవరి 13న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ చిత్రీకరణ పనులను పరుగులు పెట్టిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాతి భారీ షెడ్యూల్ సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ లెంగ్తీ షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకు సం గీతం: థమన్; డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్; యాక్షన్: రామ్ నబకాంత్; డైలాగ్స్: భాను-నందు; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా; ఎడిటర్: ఆంటోనీ రూబెన్.






