గురి పెట్టారు.. గోల్డ్ కొట్టారు!

25-09-2026 | 02:03pm

చివరి వరకు టెన్షన్.. చివరికి గోల్డ్ షాట్! 

నాగోయా వేదికగా భారత షూటర్లు మరోసారి సత్తా చాటారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో(10m Air Pistol Mixed Team) సురుచి సింగ్, కమల్‌జీత్ జోడీ అదరగొట్టి స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో 484.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి భారత్‌కు రెండో గోల్డ్ అందించారు. ఇక పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్‌లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంక్ష్ పాటిల్, నీరజ్ కుమార్ త్రయం 1762 పాయింట్లతో రజతం సాధించింది.

చైనా 1766 పాయింట్లతో స్వర్ణం దక్కించుకోగా.. కొరియా కాంస్యంతో నిలిచింది. ఒకవైపు గోల్డ్ షాట్(Asian Games Shooting India).. మరోవైపు సిల్వర్ టార్గెట్.. షూటింగ్ రేంజ్‌లో భారత జెండా మరోసారి రెపరెపలాడింది. జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత షూటర్లు సురుచి సింగ్, కమల్‌జీత్‌లకు హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ శుక్రవారం అభినందనలు తెలిపారు.





మరిన్ని వార్తలు