సహనంతో సామాజిక మార్పు సాధించాలి

03-10-2026 | 05:25am
  1. అదే గాంధీజీ ఆశయం
  2. జాతిపిత సిద్ధాంతాలే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి
  3. సత్యాగ్రహ పంథా నేటి యువతరానికి ఆచరణీయం
  4. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి) : సహనంతో కూడిన ప్రజాస్వామిక పోరాటాల(Democratic struggles) ద్వారా సామాజిక మార్పు(Social Change) సాధించడమే గాంధీజీ ఆశయం(Gandhiji Vision) అని మాజీ సీఎం కేసీఆర్(KCR) తెలిపారు. విద్వేషపూరిత పాలనా పద్ధతులను విడనాడి శాంతి సౌభ్రాతృత్వాలను నెలకొల్పడమే గాంధీజీకి మనమంది ంచే ఘన నివాళి అని పేర్కొన్నారు. శుక్రవారం గాంధీజీ జయంతి పురస్కరించుకుని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలపుతూ, జాతిపితకు నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ(Mahatma Gandhi) అనుసరించిన ప్రజాస్వామిక శాంతియుత పోరాట(Peaceful struggle) కార్యాచరణ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తనకు స్పూర్తిగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు.

ప్రజాస్వామిక హక్కుల సాధనకోసం గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహ పంథా నేటి యువతరానికీ ఆచరణీయమని పేర్కొన్నారు. గాంధీ జయం తి సందర్భంగా దేశ స్వాతంత్య్రం కోసం వారి త్యాగనిరతని స్మరించుకుంటూ, బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. న్యాయమైన ప్రజల ఆకాంక్షల కోసం, నిరంకుశ ప్రభుత్వా ల మీద పోరాడే నాయకత్వం, విశాల దృక్పథంతో తమ పోరాట కార్యాచరణను రూ పొందించుకోవాలనే తాత్వికతను గాంధీజీ జీవితం నుంచి నేర్చుకోవాల్సి వున్నదని తెలిపారు.

పీడితులందరినీ సమన్వయం చేసు కుంటూ, భావజాల వ్యాప్తిని చేస్తూ, శాంతియుత పోరాటంలో భిన్న వర్గాలను ఐక్యసం ఘటన శక్తిగా తీర్చిదిద్దుకోవాలనే గాంధీజీ ఆశయాలను ప్రతీవొక్కరు అనుసరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధన కోసం తాను వొంటరిగా ముందడుగు వేసిన నాటినుంచి నేటి వరకు ఎన్ని కష్టాలొచ్చినా తాను స్థిత ప్రజ్జతతో అనుసరిస్తున్న కార్యాచరణలో గాంధీజీ స్ఫూర్తి ఇమిడి వున్నదని కేసీఆర్ స్పష్టం చేశారు. విద్వేష పూరిత ప్రసంగాల ను, కక్షపూరిత వైఖరులను విడనాడి, ప్రజల నడుమ శాంతి సౌభ్రాతృత్వం పరిఢవిల్లేలా పాలనను కొనసాగించడం ద్వారా మాత్రమే జాతిపిత మహాత్మాగాంధీ కి మనం నిజమైన నివాళులు అర్పించిన వారమౌతామని కేసీఆర్ పునరుద్ఘాటించారు.  

మరిన్ని వార్తలు