మేరు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కీర్తి రాజగోపాల్ మేరు
ఏకగ్రీవంగా ఎన్నిక
హైదరాబాద్, సెప్టెంబర్ 5(విజయక్రాంతి): మేరు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కీర్తి రాజగోపాల్ మేరు (Keerthi Rajagopal as State President of Meru Sangham)ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం, గోషామహల్‌లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో రాజగోపాల్ మాట్లాడుతూ బాగ్ లింగంపల్లి సుందరయ్య కళా భవనంలో, రాష్ట్ర మేరు కార్పొరేషన్ కన్వీనర్ సంఘ వెంకట రాజం, కో కన్వీనర్ మాడిశెట్టి లక్ష్మీనారాయణ, మేరు జిల్లా, రాష్ట్ర నాయకులు, అడాక్ కమిటీ సభ్యులు మాజీ అధ్యక్షులు కీర్తి ప్రభాకర్, జేఏసీ నాయకులు, మేరు మేధావుల సమక్షంలో ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా సాగిన, రౌండ్ టేబుల్ సమావేశంలో, తనను ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని అర్హులైన మేరు కులస్తులకు కుట్టు మిషన్లు అందేలా తన వంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం మేరు కులస్తులకు అందించేలా, వారికి అండగా నిలుస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి అప్పగించిన, సంఘ వెంకట రాజం, మాడిశెట్టి లక్ష్మీనారాయణ,కీర్తి ప్రభాకర్, మేధావులు, జేఏసీ నాయకులకు కృతజ్ఞతలు అయన తెలిపారు. తనకు ఈ పదవి మరింత బాధ్యత పెంచిందని, అనునిత్యం మేరు కులస్తుల సంక్షేమ అభివృద్ధి కోసం పాటుపడతానని రాజగోపాల్ తెలిపారు.






