ఏసీబీకి పట్టుబడిన కీసర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి
17-09-2026 | 05:08pm
మేడ్చల్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కీసర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్రెడ్డిల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న రూ.5 లక్షలు తీసుకుంటూ ఇద్దరూ ఏసీబీకి చిక్కినట్లు సమాచారం.
సీఐ ఆంజనేయులు ఇంట్లో నిర్వహించిన సోదాల్లో రూ.5లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్‌రెడ్డి ఇళ్లలో స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
లంచం కేసులో ఇద్దరు పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కడంతో కీసర, బోగారం ప్రాంతాలకు చెందిన కొందరు స్థానికులు కీసర పోలీస్ స్టేషన్ ఎదుట సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ముందు బాణసంచా కాల్చినట్లు సమాచారం. కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.