కేసముద్రం స్టేషన్‌లో లిఫ్ట్ పెట్టించండి

06-10-2026 | 05:00am

తెలంగాణలో మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మున్సిపాలిటీకి(Kesamudram Municipality) ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వ్యాపార, వాణిజ్య కేంద్రంగానే కాకుండా రవాణా రంగంలోనూ కీలకంగానే ఉంది. రోడ్డుమార్గంతో పాటు రైల్వే మార్గం కూడా ఉండడం, పసుపు మార్కెట్‌కు ఎక్కువగా ఉపకరిస్తోంది. న్యూ ఢిల్లీ  చెన్నై రైల్వే మార్గంలో(New Delhi-Chennai railway route) కేసముద్రం ఒకటి కావడం మరింత ప్రాధాన్యంగా నిలుస్తోంది. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు(Superfast Express trains) కూడా ఇక్కడ హాల్టింగ్ ఉంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికు లకు అవసరమైన సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

ముఖ్యం గా మూడు ప్లాట్‌ఫాంలు కలిగిన ఈ స్టేషన్‌లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి పైనుంచి ప్లాట్‌ఫాంలకు చేరుకోవడానికి వృద్ధులు, పిల్లలు, మహిళలు, అనారో గ్యంతో బాధపడేవారు ఇబ్బంది పడుతున్నారు.  ఫుట్‌ఓవర్ బ్రిడ్జి కూడా ఎత్తుగా ఉండటం, మెట్లు కూడా ఎక్కువగా ఉండడం వల్ల లగేజీ ఎక్కువగా ఉన్నవారు ప్లాట్‌ఫాంల పైకి చేరుకోవడానికి అవస్థలు పడాల్సి వస్తోంది.  రైలు వచ్చే సమయం దగ్గరపడినప్పుడు ప్రయాణికులు హడావుడిగా మెట్లు ఎక్కే క్రమంలో చిన్నచిన్న గాయాలపాలు కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అదీగాక టికెట్టు కౌంటర్ ఒక్కవైపే ఉండడం రెండో వైపు ఉండే ప్రయాణికులు తప్పనిసరిగా ఫుట్‌ఓవర్ బ్రిడ్జీని ఆశ్రయించా ల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్న కేంద్ర ప్రభు త్వం  కేసముద్రం స్టేషన్ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.  రైళ్ల హాల్టింగ్ సంఖ్యను పెంచడం మాత్రమే కాకుండా ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి.  మొదటి ప్రాధాన్యతగా మూడు ప్లాట్‌ఫాంలకు సులభంగా చేరుకునే విధంగా లిఫ్ట్ ఏర్పాటు చేయాలి. అవసరాన్ని బట్టి ఎస్కలేటర్ సౌకర్యాన్ని కూడా పరిశీలించాలి. అలాగే మరోవైపు టికెట్ కౌంటర్ ఏర్పాటు చేసి ప్రయాణికుల రాకపో కలను సులభతరం చేయాలి.

 ఆళవందార్ వేణు మాధవ్, 8686051752 

మరిన్ని వార్తలు