26 August, 2026 | 1:18 PM

కాంగ్రెస్ అభివృద్ధిలో యువజన కాంగ్రెస్ నాయకుల కీలక పాత్ర

26-08-2026 12:36 PM

తుంగతుర్తి (విజయ క్రాంతి): వైట్ హౌస్ లో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి సమక్షంలో నూతనకల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పసుల అశోక్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుత.., కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో యువజన కాంగ్రెస్ నాయకుల పాత్ర కీలకమని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల గెలుపు పోరులో ఐకమత్యంతో నాయకులు కృషి చేయాలని కోరారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ నాయుడు, కోతి గోపాల్ రెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మూడు మోహన్ నాయక్, తంగెళ్ల కర్ణాకర్ రెడ్డి, ధారావత్ వీరన్న, తదితర నాయకులు పాల్గొన్నారు.