జిల్లాస్థాయి కిసాన్ మేళాలో ప్రజాప్రతినిధులు, ఏఈవోలు

01-10-2026 | 12:08am

వ్యవసాయ, అనుబంధ శాఖల స్టాళ్ల పరిశీలన

ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన

సాంకేతిక పరిజ్ఞానం, విత్తనాలపై నిపుణుల సూచనలు

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): జిల్లా వ్యవసాయశాఖ(District Agriculture Department) ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్ మేళా-2026(District Level Kisan Mela-2026)లో నాగిరెడ్డిపేట మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఏఈవోలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మెల్లకుంట తండా సర్పంచ్ రామావత్ బాల్య నాయక్, జలాల్‌పూర్ సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడు జమ్మికుంట జీవరత్నం, ఆత్మకూర్ క్లస్టర్ ఏఈవో రజిత పాల్గొన్నారు.

కిసాన్ మేళాలో వ్యవసాయశాఖ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలించారు. రైతులకు ఉపయోగపడే ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నాణ్యమైన విత్తనాలు, పంటల సాగు విధానాలు, ఉద్యానవన పంటల సాగు, ఆధునిక పద్ధతులపై వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పంటల సాగులో అధిక దిగుబడులు సాధించే విధానాలను వివరించారు.కార్యక్రమంలో  ఆయా మండల వ్యవసాయ అధికారులు, ఏఈవోలు,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు