5 September, 2026 | 4:34 PM

భూములు దోచుకోవడానికే 22ఏ

05-09-2026 | 03:04pm
  1. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం ఒకటే.. భూములు అమ్మడం 
  2. భూములు అమ్మకపోతే ప్రభుత్వం నడవలేని పరిస్థితి
  3. అన్ని భూములపై సీఎం రేవంత్ కన్నేశారు
  4. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం భూములు అమ్మడమే
  5. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజాస్వామ్యంలో ఉందా?

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) ''యువ సమరభేరి" చేస్తుంటే, బీజేపీ రైతుల సమస్యలపై పోరుబాటకు దిగింది. ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ(Bharatiya Janata Party) మహాధర్నా చేస్తోంది. నిషేధిత భూములపై బీజేపీ నేతలు గళమెత్తారు. మహాధర్నాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) మాట్లాడుతూ... భూములు దోచుకోవడానికే 22ఏ తీసుకొచ్చారని ఆరోపించారు. 22ఏ(22A) కింద తమ భూములు ఉన్నాయని చాలామందికి తెలియదన్నారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) ఎలా దోచుకుందో అందిరికీ తెలుసన్నారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దోచుకుంటోందన్నారు. అన్ని రకాల అనుమతులు ఉన్న భూములను 22ఏలో పెట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని స్థిరాస్తి వ్యాపారంగా మార్చారని ఆరోపించారు.

కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) లాగే రేవంత్ రెడ్డి కూడా భూములను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం ఒకటే.. భూములు అమ్మడం అన్నారు. భూములు అమ్మకపోతే ప్రభుత్వం నడవలేని పరిస్థితి ఉందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. వక్ఫ్ భూములపై(Waqf lands) తప్ప అన్ని భూములపై సీఎం రేవంత్ రెడ్డి కన్నేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్(RR Real Estate) సంస్థగా మార్చారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తెలంగాణలో భూములు అమ్మాలి.. డిల్లీలోని కాంగ్రెస్ కు ఇవ్వాలన్నారు.

ఉద్యోగులకు జీతాలు, రిటైర్ మెంట్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితికి వచ్చారని చెప్పారు. 60 లక్షల ఎకరాలకు పైగా భూమిని 22ఏలో పెట్టారని చెప్పారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజాస్వామ్యంలో ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులను(Congress leaders), అధికారులను హెచ్చరిస్తున్నా.. మీరు దోచుకున్న ప్రతి రూపాయి వసూలు చేసి ప్రజలకు పంచుతామన్నారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ కూడా 30 శాతం కమీషన్ అడుగుతోందన్నారు. కమీషన్ల కోసమే ప్రజల భూములను నిషేధిత జాబితాలో పెట్టినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


మరిన్ని వార్తలు