నాగిరెడ్డిపేట్లో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

27-09-2026 | 08:26pm

నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో నాగిరెడ్డిపేట్ మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు, స్వతంత్ర సమరయోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) 111వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండల పద్మశాలి సంఘం జనరల్ సెక్రెటరీ మంత్రి ఆంజనేయులు మాట్లాడుతూ... స్వతంత్ర సమరయోధుడు.. తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశాలి, మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు.

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు సమానత్వం, సామాజిక న్యాయం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం పోరాడారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని ఆయన ఆశలను సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గోపాల్పేట్ పద్మశాలి సంఘం అధ్యక్షులు వినోద్, పద్మశాలి సంఘం సభ్యులు విట్టల్, మహేష్, ప్రశాంత్, నాగరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు