వైద్య విద్యార్థిని చదువుకు కేటీఆర్ భరోసా

22-09-2026 | 05:05am

ట్వీట్‌కు స్పందించి ఆర్థిక సహాయం 

మహబూబాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా(Warangal District) వర్ధన్నపేటకు చెందిన ఓ నిరుపేద వైద్య విద్యార్థి(Medical student)ని కొండేటి అకిరా(Kondeti Akira) చదువుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. వర్ధన్నపేటకు చెందిన కొండేటి భాస్కర్ దంపతుల కుమార్తె నీట్‌లో ర్యాంకు సాధించి మహేశ్వర మెడికల్ కళాశాల(Maheswara Medical College)లో ఎంబీబీఎస్ సీటు(MBBS seat) సాధిం చింది. అయితే ఆమె అడ్మిషన్‌తోపాటు అవసరమైన ఫీజు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అకిరా తన కుటుంబ పరిస్థితిని వివరిస్తూ కేటీఆర్‌కు ట్విట్ చేశారు.

ఈ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్ అకిరా చదువుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తాను అందిస్తానని సమాధానం ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు కేటీఆర్ సోమవారం అకిరాతో పాటు కుటుంబ సభ్యులను హైదరా బాద్ తెలంగాణ భవన్‌లో కలిశారు. అకీరాకు రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ అందజేశారు. చక్కగా చదువుకొని, భవిష్యత్తులో మంచి డాక్టర్ అయి పేదలకు వైద్యం అందించాలని దీవించారు. 

మరిన్ని వార్తలు