సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

04-10-2026 | 12:00am

గోదావరిఖనిలో కేటీఆర్‌ సభ సన్నాహక సమావేశం

గోదావరిఖని, అక్టోబర్ 3(విజయ క్రాంతి) : పెద్దపల్లి జిల్లా(Peddapalli District) గోదావరిఖనిలోని టీబీజీకేఎస్‌ కేంద్ర కార్యాలయంలో(TBGKS Central Office) కేటీఆర్‌(KTR) ఆధ్వర్యంలో జరగనున్న సింగరేణి సభ(Singareni Meeting) సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. మాజీ మంత్రి, టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్‌(Koppula Eshwar) సమావేశానికి హాజరయ్యారు. సింగరేణి సభను విజయవంతం చేయడంతో పాటు కార్మికులు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై సమావేశంలో చర్చించారు. మెడికల్‌ బోర్డు నిర్వహణను(Conduct of Medical Board) వేగవంతం చేసి కార్మికులకు న్యాయం చేయాలని, 2025–26 సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాల వాటాను(Profit share) కార్మికులకు అందించాలని కోరారు.

అలవెన్సులు, పెర్క్స్‌పై ఆదాయ పన్ను మినహాయింపు కల్పించాలని, సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్‌ బకాయిలను విడుదల చేయాలని సమావేశంలో చర్చించారు. కార్మికుల సొంత ఇంటి నిర్మాణానికి మద్దతు, పథకాల అమలు, గనుల్లో ఆధునిక యంత్రాలు, పనిముట్ల కొనుగోలు చేపట్టడం, సంస్థ భవిష్యత్తు మరియు ఉపాధి అవకాశాల కోసం నూతన గనులను ప్రారంభించడం వంటి అంశాలపై చర్చించారు.

సమావేశంలో టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసు రామ్మూర్తి, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నునె కొమరయ్య, అధికార ప్రతినిధి పర్లపెల్లి రవి, కోర్‌ కమిటీ సభ్యులు చెల్పూరి సతీష్, బడికిల సంపత్, ఆయిలి శ్రీనివాస్, మల్రాజు శ్రీనివాసరావు, మేడిపల్లి సంపత్, బండి రమేష్, బడతల సమ్మయ్య, జాఫర్, దేవ శ్రీనివాస్, దూత శేషగిరి, అవినాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు