భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ
22-09-2026 | 07:38pm
మహా ముత్తారం సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి):జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally)జిల్లా మహాముత్తారం మండలంలోని మాదారం గ్రామంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద మంగళవారం భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు భాగంగామాదారం గ్రామ వార్డు సభ్యులు బెల్లం బొందయ్య దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.