వెలికట్ట 271 సర్వే నంబర్లో భూ హద్దుల నమోదు
327 ఎకరాల 9 గుంటల భూమికి హద్దుల నిర్ధారణ..
నాలుగు ప్రత్యేక బృందాలతో సర్వే
కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలం వెలికట్ట గ్రామం(velikatta village)లోని 271 సర్వే నంబర్లో భూ హద్దుల నమోదు(Land boundary registration) ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 327 ఎకరాల 9 గుంటల విస్తీర్ణానికి సంబంధించిన భూ హద్దులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశాల మేరకు 16 మంది సిబ్బందితో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా హెడ్‌క్వార్టర్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ వంశీ(District Headquarters Deputy Inspector Vamsi) తెలిపారు. ఒక్కో బృందంలో జీపీఓ, మండల సర్వేయర్, లైసెన్స్డ్ సర్వేయర్, అసిస్టెంట్ చొప్పున నలుగురు పనిచేస్తున్నట్లు వివరించారు. తహసీల్దార్ మల్లికార్జున్‌రెడ్డి పర్యవేక్షణలో సర్వే కొనసాగుతుండగా, మండల సర్వేయర్ గణేష్ ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేస్తున్నారు. పూర్తి విస్తీర్ణానికి సంబంధించిన హద్దుల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నట్లు వంశీ పేర్కొన్నారు.