6 September, 2026 | 6:21 AM

ఉన్నత విద్యామండలి జర్నల్ ఆవిష్కరణ

06-09-2026 | 05:00am

సంచికను విడుదల చేసిన గవర్నర్

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్ర ఉన్నత విద్యామండలి(State Council of Higher Education) ‘తెలంగాణ జర్నల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(Telangana Journal of Higher Education)’ సంచికను   గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా విడుదల చేశారు. శనివా రం లోక్‌భవన్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ సమక్షంలో గవర్నర్ జర్నల్‌ను ఆవిష్కరించారు. ఉన్నత విద్యారంగంలో పరిశోధన, అకడమిక్ స్కాలర్‌షిప్, సమకాలీన అంశాలపై విజ్ఞానపూర్వక చర్చలను ప్రోత్సహించేందుకు చేస్తున్న కృషిని గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. 

మరిన్ని వార్తలు