సీతారాం ఆశయ సాధనకు కృషి చేద్దాం

13-09-2026 | 05:05am

బడంగ్పేట్  సెప్టెంబర్ 12(విజయక్రాంతి): ప్రపంచ కమ్యూనిస్టు(World Communist) మేధావి, సీపీఐ(ఎం) జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి(Sitaram Yechury) ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం జిల్లా నాయకులు(CPM district leaders), బాలాపూర్ మండల ఇన్ఛార్జ్ గోరెంకల నర్సింహా(Gorenkala Narasimha) పిలుపునిచ్చారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని బాలాపూర్ సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో బాడంగ్పేట్ జీహెచ్‌ఎంసీ చౌరస్తా వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా గోరెంకల నర్సింహా, సీనియర్ నాయకులు సుంకోజు యాదగిరి చారి, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ సీనియర్ నాయకులు రాజలింగం తదితరులు ఏచూరి చిత్రపటాని కి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. అనంతరం గోరెంకల నర్సింహా మా ట్లాడుతూ సీతారాం ఏచూరి భారతదేశంలో ని ప్రముఖ మార్క్సిస్టు మేధావిగా ప్రజాస్వా మ్యం, లౌకికవాదం, దేశ సమైక్యత కోసం త న జీవితాంతం కృషి చేశారని కొనియాడా రు.

మతోన్మాద, మనువాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, అభ్యుదయ, లౌకిక శక్తులను ఏకం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. దేశంలో ప్ర జాస్వామ్య పరిరక్షణ కోసం విభిన్న రాజకీ య శక్తులను ఏకం చేయడంలో ఏచూరి చే సిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆ యన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ మండల కమిటీ సభ్యులు వి. శేఖర్ యాదవ్, దాసరి బాబు, సీనియర్ నాయకులు సుంకోజు యాదగిరి చారి, బీసీడబ్ల్యూ కార్యదర్శి దాసరి నర్సింహా, కోశాధికారి ధన్నాసి మల్లికార్జున్, సీహెచ్ కుమార్, ఆదం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు