లింగాపురంలో వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ (వీజీపీపీ ) గ్రామ సభ
- వి బి జి - ఆర్ ఎ యం జి పథకం కింద అభివృద్ధి పనులపై చర్చ
- సెక్రెటరీ బానోతు నరసింహ అధ్యక్షతన నిర్వహణ, సర్పంచ్ మంగా, ఉప సర్పంచ్ నరేష్ హాజరు
- 12 రకాల అభివృద్ధి పనులు, కొత్త లబ్ధిదారుల ఎంపిక
చర్ల, అక్టోబర్ 02, 2026 : విజయ క్రాంతి: చర్ల మండలం లింగాపురం గ్రామంలో వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ (వీజీపీపీ ) గ్రామ సభను శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించారు. సెక్రటరీ బానోతు నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గుగులోతు మంగా, ఉప సర్పంచ్ తడికల నరేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
వి బి జి - ఆర్ ఏ ఎం జి పథకం కింద గ్రామ పంచాయతీలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై చర్చించి, గ్రామ సభ ఆమోదం పొందారు.చర్చించబడిన ముఖ్యమైన పనులు: సోక్ పిట్స్, ఫార్మ్ పాండ్స్, ఫిష్ పాండ్స్, బాత్రూమ్ / ఐ హెచ్ హెచ్ ఎల్ నిర్మాణాలు, మేకల షెడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, బోర్ వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లు, వివో భవనం, పంచాయతీ భవనం, గ్రామ గ్రంథాలయం, కమ్యూనిటీ హాల్. అలాగే కొత్త జాబ్ కార్డులు, ఐ హెచ్ హెచ్ ఎల్ , సోక్ పిట్, ఫార్మ్ పాండ్, మేకల షెడ్డు, ఫిష్ పాండ్ కొత్త దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో లింగాపురం, పాడు లింగాపురం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సూచనలు తెలిపారు.