శిష్యుల వల్లనే గురువులకు గౌరవం
ఆచార్య మసన చెన్నప్ప :
పోరెడ్డి రంగయ్య(Poreddy Rangayya) నా దగ్గర పరిశోధన చేసినవాడు కాడు. నా రచనల(Writings) మీద పరిశోధన చేసిన వాడంత కంటే కాడు. కాని నాకు అత్యంత ప్రేమాస్పదుడైన శిష్యుడు. రంగయ్య నాలాగా సాహిత్య సంస్థల(Literary Organization) నిర్వాహకుడు. ‘తేజసాహిత్య సంస్థ’ను స్థాపించి రెండు దశాబ్దాలుగా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. తన సాహిత్య సంస్థ ద్వారా తొలినాళ్ల (2008)లో నాకు ‘తిరుమల సాహితీ పురస్కారం’ ఇచ్చింది ఆయనే. ఆ తర్వాత ఇప్పటికీ తెలంగాణలో యువ రచయితల ను తన ‘తేజ సాహిత్య సంస్థ’ ద్వారా సన్మానిస్తూ, పురస్కారాలిస్తూ సాహిత్య సేవ చేస్తూనే ఉన్నాడు. మొన్నమొన్ననే సినారె పేరు మీద ‘జీవన సాఫల్య పురస్కారం’ అందించాడు.
రంగయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో(Osmania University) (1990-92) ఎంఏ తెలుగు చేశాడు. అప్పుడు తనకి నేను ప్రత్యక్ష గురువును. నన్ను ఎక్కువగా అభిమానించిన ప్పటికీ నా పర్యవేక్షణలో పరిశోధన చేయలేదతడు. 1994లో ఎంఫీల్ డిగ్రీ తీసు కున్న తర్వాత అతడు నాకు మిక్కిలి స్నేహపాత్రుడైన ఆచార్య తిరుమల రచనల మీద పిహెచ్.డి చేశాడు.
రంగయ్య పరిశోధనా పాటవాన్ని గు ర్తించిన ఆచార్య తిరుమల, రంగయ్యను ప్రేమతో చూసినట్లే అతని గురువునైన నన్ను ఎంతోగానో అభిమానించాడు. శి ష్యుని స్వభావాన్ని బట్టి గురువులకు గౌర వం ఉంటుంది. సుమతీ శతక కరుడు రాసిన ‘పుత్రోత్సాహం’ అనే పద్యాన్ని నేను పేరడీ చేసినాను. రంగయ్యను ఇతరులు అభిమానించడాన్ని చూసి
“శిష్యోత్సాహము గురువుకు
శిష్యుడు దరి చేరినపుడు
చెందదు, జనులా
శిష్యుని కనుగొని పొగడగ
శిష్యోత్సాహంబు నాడు
చెందుర సుమతీ”
ఆచార్య తిరుమల మంచి పద్యకవి. వచన కవిత్వం రాయడంలోను దిట్ట. నేను కలిసినప్పుడల్లా మా రంగయ్య గురించి మాట్లాడేవాడు. రంగయ్య లాంటి విద్యార్థుల వల్లనే శిష్యులకు చదువు చెప్పిన గురువులకు, ఆయన చదువుకున్న విద్యా సంస్థలకు మంచి పేరు వస్తుందని నా విశ్వాసం.
రంగయ్య మంచి పరిశోధకుడు కావ డం వల్ల అతనికి లభించిన గౌరవం నాకు కూడా కల్గిందంటానికి ఒక సంఘటనను ఉదాహరించక తప్పదు. 2010 ప్రాంతం లో ఆచార్య తిరుమల రచనల మీద రాజమండ్రి (తెలుగు విశ్వవిద్యాలయం) పీజీ సెంటర్‌లో ఆయన పేరు తెలియదు కాని ఒక పరిశోధక విద్యార్థి పిహెచ్.డి చేశాడు. నేను రాజమండ్రికి ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్‌గా ‘వైవా’ తీసుకోవడానికి వెళ్లాను. అప్పుడక్కడ బేతవోలు రామబ్రహ్మంగారు డీన్‌గా పదవిలో ఉన్నారు.
పరిశీలకునిగా నేనిచ్చిన నివేదిక బేతవో లు వారికి బాగానచ్చింది. అప్పటికి పద్య రచనలోను, వచన కవితా రచనలోను కొత్త పోకడలకు శ్రీకారం చుట్టిన కవి ఆచా ర్య తిరుమల ‘వైవా’ పూర్తి ఐన తర్వాత రామ బ్రహ్మంగారు నా మీద “మ నం ఆచార్య తిరుమల బంధువుల ఇంట్లో భోజనానికి వెళ్తున్నాం. మీరు నాతో వస్తున్నారు” అన్నాడు. నేను కాదనలేదు. ఆచా ర్య తిరుమలకున్న సాహితీ మిత్రులు, బంధువులు సౌజన్యశీలురు. నేను ఆచార్య బేతవోలుతో కలిసి తిరుమల బంధువుల ఇంట్లో విందు భోజనం చేశాను. ఆ తిరుమల బంధువు నాకు హైదరాబాద్‌కు వచ్చే రైలెక్కించి, చక్కెరకేళీలు అందించిన విష యం నాకింకా జ్ఞాపకం ఉంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, గురువులకు మంచి శిష్యుల వల్లనే సమాజంలో గౌరవం పెరుగుతుందని నాకు నమ్మకం.
ఆచార్య తిరుమల ఇప్పుడు లేడు. కాని రంగయ్యతో కలిసినప్పుడల్లా తిరుమల గురించి ప్రస్తావించకుండా ఉండడు. రంగయ్యకు తెలుగంటే ప్రాణం. కాని అతనికి తెలంగాణలో ఆంగ్లోపాధ్యాయునిగా ఉ ద్యోగం లభించింది. ఇప్పటికీ పాఠశాలల్లో ఆంగ్లమే బోధిస్తాడు. కాని బయటి ప్రపంచంలో రంగయ్య తెలుగు భాషా పండితుడు. అనర్గళంగా మాట్లాడగల్గినవాడు. నేననుకుంటాను ఇప్పటికీ అతడు వందకు పైగా సాహిత్య సభలను నిర్వహించి ఉం టాడని, మరొక చిత్రమైన విషయం ఏమంటే రంగయ్య తన సాహిత్య కార్యక్రమ నిర్వహణా దక్షతతో మా గురువు గారైన డా. సినారె గారిని ఆకర్షించడం. రంగయ్య గారు హైదరాబాదులో ఏర్పా టు చేసినా, భువనగిరిలో ఏర్పాటు చే సినా, నల్గొండలో ఏర్పాటు చేసినా తప్పకుండా సాహిత్య సభల్లో సినారె మహాకవి పాల్గొనే వాడంటే రంగయ్య మా గురువు గారి అభిమానం ఎంతగా పొందినాడో అర్థమవుతుంది!
రంగయ్యకు పాఠశాలలో చదివేటప్పు డు ప్రముఖ సాహితీవేత్త లింగంపల్లి రామచంద్రగారి వల్ల తెలుగుమీద అభిమానం, అభిరుచి కల్గింది. ఆ అభిరుచి రంగయ్యలో దినదిన ప్రవర్థమానమై, అతనిచేత ఎన్నో గ్రంథాలు రచింపచేసింది. ఎనుబయేళ్ల వయస్సులోనూ నేటికీ రామచంద్రగారు రంగయ్య ఏర్పాటు చేసే సభలకు రావడం విశేషం. 30 సంవత్సరాలుగా ఆంగ్లోపాధ్యాయునిగా పనిచేస్తు న్నప్పటికీ సాహిత్య కార్యక్రమాల సంయోజకుడిగా, గ్రంథావిష్కరణలకు, పురస్కారాలకు తన ‘తేజసాహిత్య సంస్థ’ను వేదికగా చేసిన విశిష్ట వ్యక్తిగా, వక్తగా, వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు పొందినాడు రంగ య్య.
సాహిత్య కార్యక్రమాల నిర్వహణలో పడిన రంగయ్య ఎక్కువగా రచనలు చేయలేక పోయాడనిపిస్తుంది. ‘శబ్దశిల్పాలు’ అ తని మొదటి కవితా సంపుటి. డా. గోపి ప్ర భావంతో ‘బడినానీలు’ రాసి పిల్లల్లోనూ, పెద్దల్లోను తన పలుకుబడిని పెంచుకున్నాడు. రంగయ్య సంపాదకత్వంలో వెలు వడిన గ్రంథాలు విశిష్టమైనవి. 2009లో ‘మా అమ్మ’ పేరుతో మాతృమూర్తిని స్ఫూ ర్తిగా గొని ఒక కవితా సంకలనం వచ్చింది. వందలాది మంది కవులు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో ఆ కవితా సంకలనంలో అక్షరబద్ధం చేశారు. 277 మంది కవులు రచించిన ఆ కవితా సంకలనం తెలుగు సాహిత్యంలో ఈ విధమైన ఇతివృత్తంతో వచ్చిన తొలి గ్రంథంగా పేరెన్నికగన్నది. అందులోని మొదటి కవిత సినారె గారిది కావడం విశేషం.
“నన్ను తన అక్కున చేర్చుకొన్నప్పుడు ఆకాశమే నాలో ఇమిడి పోయినట్టనిపించింది” అని అమ్మనుగూర్చి ఆ మహాకవి రాసిన పంక్తులు నాకిప్పటికీ గుర్తున్నవి. ‘మా అమ్మ’ కవితా సంకలనంలో సుద్దాల అశోక్ తేజ, ఎన్.గోపి, కసిరెడ్డి, బాపురెడ్డి, మల్లెమాల, మలయశీ, రుద్రశ్రీ, రాధాశ్రీలు రాసిన కవితలతోపాటు నా కవిత కూడా ఉంది.
“నీవొడిని సింహాసనంగా చేసుకొని కూర్చున్న రోజుల్ని
నేనింకామరిచి పోలేను
వాహనాల్లేని ఆ రోజుల్లో నన్ను నువ్వే మోసుకొని వెళ్లే దానివి
అప్పుడు నీ చంక నాకు ఉయ్యాల అయ్యేది
నిన్నా దేవుడు అమ్మగా ఇవ్వకపోతే
నన్నీలోకం ఇంతగా మెచ్చుకునేది కాదు” అని మా అమ్మను
గూర్చి రాసిన కవితా పంక్తుల్ని చదివినప్పుడు నా కళ్ల నుంచి ఆనందాశ్రువులు రాలడం సహజం, మా అమ్మ ప్రత్యక్షం కావడం నిజం.
రంగయ్యగారికి మంచిపేరుతెచ్చిన మరో సంకలన గ్రంథం
‘నిత్యచైతన్యశీలి సినారె’ ఇది 2010లో అచ్చైంది. ‘చంద్రాలోకం’ సోమాయణం, ఆలేరుదర్శిని, సాహితీ సుగంధం, అగ్నిపుష్పాలు మొదలైన గ్రంథాలు రంగయ్య సాంపాదకత్వంలో వచ్చినవి. వీరి అనువాద గ్రంథం ‘సరదాల ఆదివారం’ ఎన్. బి.టి ఆధ్వర్యంలో అచ్చైంది.
డా. రంగయ్య సాహిత్య కార్యక్రమాలకిచ్చిన సమయాన్ని రచనా వ్యాసంగానికి ఇచ్చినట్లయితే, అతని కలం నుంచి ఎన్నో రచనలు వచ్చేవి.