26 August, 2026 | 9:54 AM

మల్కాపూర్ ను సందర్శించిన లయోలా కాలేజీ స్టూడెంట్స్

26-08-2026 08:45 AM

తూప్రాన్, ఆగస్ట్ 26 (విజయక్రాంతి): మండలం లోని మల్కాపూర్ గ్రామ పంచాయతీని హైదరాబాద్ లోని లయోలా కాలేజ్ నుండి డిగ్రీ స్టూడెంట్స్ రూరల్ డెవలప్మెంట్ సబ్జెక్టులో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పల్లె ప్రకృతి వనం, నర్సరీ సిగ్రిగేషన్ షెడ్ లో వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం చాలా చక్కగా రూపుదిద్దుకున్న రాక్ గార్డెన్ ను, సందర్శించారు. గ్రామ పంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కాపూర్ అభివృద్ధి, విశిష్టత గూర్చి ఎంపీడీవో సతీష్ వివరించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ చాలా చక్కగా చెప్పిన దాని విని నోట్ చేసుకోవడం జరిగింది. అనంతరం స్టూడెంట్స్ ఇంత చక్కగా అభివృద్ధి చేసిన మల్కాపూర్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇందులో లయోలా కాలేజ్ లెక్చరర్స్, ఫారెస్ట్ అధికారులు,  గ్రామ పాలన విభాగం, గ్రామ సెక్రెటరీ, లయోలా కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు.