మలేరియా, డెంగ్యూ నియంత్రణ చర్యలు

05-10-2026 | 07:12pm

మలేరియా, డెంగ్యూ నియంత్రణ చర్యలను మరింత పటిష్టంగా చేపట్టాలి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారామ్ రాథోడ్

పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District)లో మలేరియా, డెంగ్యూ వ్యాధుల నియంత్రణ, ముందస్తు గుర్తింపు, పరీక్షలు,నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ(District Medical and Health Department) అధికారి డా. తుకారామ్ రాథోడ్ సంబంధిత అధికారులకు, సిబ్బందినీ ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్లు, సబ్‌యూనిట్ అధికారులు, మలేరియా టెక్నీషియన్లు, సపోర్ట్ సూపర్‌వైజర్లు తదితరులతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ఆరోగ్య కేంద్రాల్లో జరుగుతున్న మలేరియా, డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు, కేసుల గుర్తింపు, సబ్‌సెంటర్ వారీ పనితీరు, పరీక్షా కిట్ల నిల్వ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

సమీక్షించిన ముఖ్య అంశాలు:

జిల్లాలో నమోదైన  మలేరియా పాజిటివ్ కేసుల(Malaria-positive cases) వివరాలను సమీక్షించారు. డెంగ్యూ పాజిటివ్ కేసుల పరిస్థితి, పరీక్షలు  సంబంధిత నిఘా చర్యలను పరిశీలించారు. సబ్‌సెంటర్ వారీగా పరీక్షల నిర్వహణ, కేసుల గుర్తింపు పనితీరును సమీక్షించారు. ప్రతి ఆరోగ్య కేంద్రం వారీగా మలేరియా, డెంగ్యూ నిర్ధారణ పరీక్షల పురోగతిని పరిశీలించారు.

అనుమానిత జ్వర కేసులను నిర్లక్ష్యం చేయకుండా ఫీల్డ్ స్థాయిలో ఆర్డీటీల ద్వారా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అధికంగా టెస్టింగ్ కిట్లు ఉన్న కేంద్రాలను గుర్తించి, కిట్లు లేని, తక్కువ నిల్వ ఉన్న ఆరోగ్య కేంద్రాలకు అదనపు కిట్లను పునఃపంపిణీ చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో భద్రాచలం డిప్యూటీ డిఎంహెచ్వో ఎం శ్రీధర్, అసిస్టెంట్ మలేరియా అధికారి డా, రవి, ల్యాబ్ టెక్నీషియన్లు, సబ్‌యూనిట్ అధికారులు, మలేరియా టెక్నీషియన్లు, సపోర్ట్ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు