అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

21-09-2026 | 08:14pm

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్‌ మండలానికి(Bhikkhunur Mandal) చెందిన గజ్జె స్వామి (56) అనారోగ్య కారణాలతో(health reasons) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ ఎస్‌. అనిల్‌ తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ఆరోగ్యంలో మెరుగుదల లేకపోవడంతో మానసిక వేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం తన పాత ఇంట్లో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఘటనపై మృతుడి భార్య గజ్జె భూలక్ష్మి సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని ఆమె పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారు మానసిక ఒత్తిడికి గురైతే కుటుంబ సభ్యులు, వైద్య నిపుణుల సహాయం తీసుకోవాలని పోలీసులు సూచించారు.

మరిన్ని వార్తలు