సెల్ ఫోన్ కోసం యువకుడి దారుణ హత్య
వెల్దుర్తి,(విజయక్రాంతి): వెల్దుర్తి మండలం మన్నెవరు జలాల్పూర్ గ్రామంలో రాత్రి సుమారు 10:00 గంటల సమయంలో, బ్యాగరి రామనుజం, తండ్రి సాయిలు, వయస్సు 42 సంవత్సరాలు, అనే వ్యక్తిపై కొంతమంది వ్యక్తులు దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలో జరిగిన గణేశ్ ఉత్సవాల సందర్భంగా మృతడు సెల్ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో, అదే గ్రామానికి చెందిన గుండ్ల ప్రవీణ్ తో మరో ఎనిమిది మంది కలిసి రామనుజాన్ని పట్టుకుని కింద పడేసి, విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రామనుజం రాత్రి సుమారు 11:00 గంటల సమయంలో మృతి చెందినట్లు సమాచారం తెలుసుకున్నారు. వెల్దుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. ఇట్టి సంఘటన కీ సoబoదించి తుప్రాన్ సిఐ వెంకట్ రాజ్ గౌడ్, విచారణ చేపట్టి మన్నేవార్ జలాలపూర్ గ్రామానికి చెందిన అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.