పోలీస్ స్టేషన్‌ను విజిట్ చేసిన మంచిర్యాల డీసీపీ భాస్కర్
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ (Mancherial DCP Eggadi Bhaskar)పర్యటించారు. వన్ టౌన్ ను సందర్శించారు. సీసీటీఎన్‌ఎస్ ఆన్‌లైన్ నమోదు, స్టేషన్ నిర్వహణ, రికార్డులు, పెండింగ్ కేసులపై సమీక్ష చేశారు.ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. బఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు,పెండింగ్ కేసుల పురోగతి, సిబ్బంది పనితీరు, శాంతిభద్రతల పరిస్థితులను పరిశీలించారు.
కేసులకు సంబంధించిన వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో సకాలంలో నమోదు చేయాలని,కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలను డిజిటల్ రూపంలో అప్‌లోడ్ చేయాలని సీఐకి సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు సత్వర, పారదర్శక,నాణ్యమైన పోలీసు సేవలు అందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మహిళలు,చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని,పెండింగ్ కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణ,రోడ్డు భద్రత,ప్రజలతో సత్సంబంధాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం పట్టణం లో పలు గణేష్ మండపాళ్ల ను సందర్శించారు. భద్రత రక్షణ చర్యలను పరిశీలించారు. ఆయన వెంట బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ రావు ఎస్సైలు తిరుపతి,రామకృష్ణ తదితరులు ఉన్నారు.