పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ బొల్లారంలో ఘనంగా ముగిసిన మండల స్థాయి క్రీడా పోటీలు

24-09-2026 | 08:09pm

విజేతలకు బహుమతులు అందజేసిన స్థానిక సర్పంచ్ బద్దిగారి ప్రభు గౌడ్

నాగిరెడ్డిపేట్,సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి):మండలంలోని బొల్లారంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల వేదికగా రెండు రోజుల పాటు (సెప్టెంబర్ 23, 24 తేదీలలో) నిర్వహించిన అండర్-14, అండర్-17 బాలురు,బాలికల మండల స్థాయి క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి.ఈ క్రీడల్లో వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో పోటీలను నిర్వహించారు.విజేతలకు గ్రామ సర్పంచ్ బద్దిగారి ప్రభుగౌడ్ బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా రెండు రోజుల పోటీలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జోనల్ స్థాయి పోటీల కొరకు ఎంపిక చేయడం జరిగింది.ఖో-ఖో (అండర్-17 ) బొల్లారం హైస్కూల్ బాలురులు విన్నర్, ఆత్మకూర్ జెడ్ పిహెచ్ఎస్ పాఠశాల బాలురు రన్నర్,కబడ్డీలో బొల్లారం పాఠశాల బారులు విన్నర్,మాల్తుమ్మెద హై స్కూల్ పాఠశాల బాలురు రన్నర్గా,నిలిచారు.మరియు కబడ్డీ బాలికలు కేజీబిపి విన్నర్గా,ఆత్మకూర్ రన్నర్ గెలుపొందారు.

వాలీబాల్ బాలురు విభాగంలో టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ విన్నర్గా, టీజీఎంఎస్ గోపాలపేట రన్నర్గా [2, 3] నిలిచారు.వాలీబాల్ బాలికలు తాండూర్ విన్నర్గా,మాల్తుమ్మెద రన్నర్గా గెలుపొందారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రభుగౌడ్,ఎంఈఓ వెంకట్ రెడ్డి,ఎంపీడీవో గంగాధర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు  బాలాజీ,వ్యాయామ ఉపాధ్యాయులు  సుకుమార్ గౌడ్,పిఆర్టియు జనరల్ సెక్రటరీ పుట్ట. శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు