అందుతండాలో కొనసాగుతున్న పంచమి ఉత్సవాలు..
- ఏమైకుంటాలో సాంప్రదాయ నృత్యం చేస్తున్న లాభానాలు...
- ఐదు రాష్ట్రాల సంఘం... అందుతాండ..
- రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఉత్తర భారతదేశం నుండి తరలివచ్చిన మత్తురా లాభానాలు..
- అందుతండా లో కొనసాగుతున్న పంచమి ఉత్సవాలు..
ఉట్నూర్, సెప్టెంబర్ 30( విజయక్రాంతి): మత్తురా లాభానా ల కుల(Mathura Labhana community) దేవతలు కొలువుదీరిన అందుతాండ గ్రామం ఐదు రాష్ట్రాల ప్రజలకు సంఘమంగా మారింది. ప్రతి ఏటా పితృ మాసంలో లాభానా లు భక్తి శ్రద్ధలతో కుల దేవతల మొక్కులు తీర్చుకునే పంచమి ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలోని వివిధ మండలాల్లో నివాసముండే లాభానా ల తోపాటు మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలలోని వివిధ జిల్లాలను నివాసముండే లాభానా లు కుటుంబ సమేతంగా ప్రత్యేక వాహనాలను తరలివచ్చారు.
అందుతాండా లో కొలువుదీరిన దుర్గాదేవి, కాలు బాబా, బాచు బాబా ల కు మొక్కులు తీర్చుకునే సమయం వరకు మత్తురా లాభానా లు తమ సాంప్రదాయాలను నృత్యాలను తండాల వారితో పోటీపడి ప్రత్యేక నృత్యాలు చేశారు. అందుతాండా తోపాటు ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయకుంట గ్రామంలో పంచమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు వివిధ గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు.
అందుతాండాలోని కాలు బాబా,పాచి బాబా ఆలయ పూజారి మత్తురా లాభానా ల కుల గురువు బాబా రామసేన మహారాజ్ ఆశీస్సులను తీసుకున్నారు. ప్రతి ఏట నిర్వహించే ఈ ఉత్సవాలకు ఐదు రాష్ట్రాల కు చెందిన మత్తురా లాభానా లు అందుతాండలో కలుసుకొని క్షేమమాచారాలు తెలుసుకోవడంతోపాటు కుల దేవతల మొక్కులు తీర్చుకున్నారు.