మయూర హాస్పిటల్స్‌కు డిజిటల్ హెల్త్ ఇన్నోవేషన్
గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సీఈవో
డయాబెటిస్ రివర్సల్‌కు డీఎన్‌ఏ, డేటా, ఏఐ వినియోగం
హైదరాబాద్, సెప్టెంబర్ 30(విజయక్రాంతి): డయాబెటిస్, మెటబాలిక్ వ్యాధుల చికిత్సలో డీఎన్‌ఏ, రక్తంలోని బయోమార్కర్లు, వేరబుల్ పరికరాల ద్వారా నిరంతరం లభించే ఆరోగ్య సమాచారం, కు టుంబ వైద్య చరిత్ర, ఆహారపు అలవాట్లు, ఆయుర్వేద ప్రకృతి వంటి అంశాలను సమగ్రంగా విశ్లేషించి వ్యక్తిగత చికిత్స అందిస్తున్న మయూరా హాస్పిటల్స్(Mayura Hospitals)కు జాతీయ స్థాయిలో ‘డిజిటల్ హెల్త్ ఇన్నోవేషన్ అవార్డు(National Digital Health Innovation Award)’ లభించింది.
నోయిడాలోని ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పో సెంటర్‌లో ఈ నెల 25 నుంచి 27 వర కు జరిగిన నేషనల్ ఆయుష్ ఫెస్టివల్ 2026 (ఆయుర్ మహోత్సవ్)లో ఈ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా మయూరా హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ సీ ఈఓ డాక్టర్ హను యెడ్లూరి అవార్డును అందుకున్నారు. ఆయుర్ వైద్య ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారం, ఆయుష్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ భాగ స్వామ్యం ఉంది.
డయాబెటిస్‌ను జీవితాంతం మం దులతో నియంత్రించడం మాత్రమే కాకుండా, రోగి ఆరోగ్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని ‘రివర్సల్, రిమిషన్, రీస్టొరేషన్’ విధానంతో చికిత్స అందించాలన్న మయూరా హాస్పిటల్స్ ప్రయత్నాలకు ఈ అ వార్డు గుర్తింపుగా నిలిచింది.
ఈ సందర్భంగా మయూరా హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ హను యెడ్లూరి మాట్లాడుతూ డయాబెటిస్‌ను కేవ లం నియంత్రించడం కాకుండా, రివర్సల్స్‌కు అవకా శం ఉన్న సందర్భాల్లో దానిపై దృష్టి పెట్టడమే మా లక్ష్యం అని తెలిపారు. ఆయుర్వేదంలోని వ్యక్తిగత ఆరోగ్య విధానాన్ని ఆధునిక వైద్యం, డేటా, ఏఐ, డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానం చేసి మరింత సమ గ్ర ఆరోగ్య సంరక్షణ అందించడమే మా లక్ష్యం. ఈ విధానాన్ని తెలంగాణలోని ప్రతి జిల్లాకు, అనంతరం దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలనుకుంటున్నాం అని డాక్టర్ హను యెడ్లూరి తెలిపారు.