మధ్యవర్తిత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలి

19-09-2026 | 03:40pm

వనపర్తి, ( విజయక్రాంతి ) : కోర్టుల్లో కేసులు ఉన్న వారు డబ్బు, సమయాన్ని వృథా చేసుకోకుండా మధ్యవర్తిత్వ వ్యవస్థను (Arbitration system)సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (Legal Services Authority) అధ్యక్షులు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి బాకరాజు శ్రీనివాసరావు సూచించారు.

శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైవాహిక, ఆస్తి, కుటుంబ, డబ్బు తదితర వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా ఇరు పక్షాల అంగీకారంతో త్వరగా పరిష్కరించుకోవచ్చన్నారు. వనపర్తి జిల్లాలో 15 మంది శిక్షణ పొందిన మధ్యవర్తులు ఉన్నారని, రాజీకి అవకాశం ఉన్న కేసులను మధ్యవర్తిత్వానికి పంపవచ్చని తెలిపారు. దీనివల్ల కోర్టుల చుట్టూ తిరగడం, ఖర్చులు తగ్గడంతో పాటు గోప్యంగా సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.

మరిన్ని వార్తలు