పెద్దలోడి పాఠశాలను సందర్శించిన ఎంఈఓ, కాంప్లెక్స్ హెచ్ఎంలు

18-09-2026 | 05:32pm

మునిపల్లి సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మండల పరిధిలోని పెద్దలోడి గ్రామంలోని జడ్పిహెచ్ఎస్, ప్రైమరీ స్కూల్ లో సాంఘిక శాస్త్రం బోధిస్తున్న వెంకటేశం తీసుకువచ్చిన చికెన్ బిర్యాని వల్లనే 34 మంది విద్యార్థులకు గురువారం ఫుడ్ పాయిజన్(Food poisoning) అయి అస్వస్థతకు గురైన విషయం అందరికీ తెలిసింది.

ఈ విషయమై జిల్లా విద్యాధికారి రోహిణి(District Educational Officer Rohini) ఆదేశాల మేరకు శుక్రవారం మండల విద్యాధికారి బీమ్ సింగ్, కాంప్లెక్స్ హెచ్ఎంలు, సంతోష్ కుమారి, తుకారాం తదితరులు పాఠశాలను సందర్శించి ఫుడ్ పాయిజన్ విషయమై విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై పాఠశాల హెచ్ఎం సునీత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది అంటూ మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సంధ్యారాణిని అడిగగా విద్యార్థులకు ఎలాంటి అపాయం లేదని తెలిపినట్టు ఎంఈఓ తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందించే పౌష్టికారాన్ని తప్ప ఇతర వస్తువులను పెట్టరాలని, బిర్యానీ, ఇతర పానీయాలను పెడితే సదరు వ్యక్తులపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దలోడి ఘటన ఇతర పాఠశాలలో రాకుండా చూసుకునే బాధ్యత ప్రధానోపాధ్యాయులమై ఎంతైనా ఉందని సూచించారు.

మరిన్ని వార్తలు