మురుగు కాలువల నిర్మాణానికి నిధుల మంజూరు..

03-10-2026 | 12:12am

ఎంఎల్ఏ జారే ఆదినారాయణ..

ములకలపల్లి,అక్టోబర్ 2 (విజయక్రాంతి): జగన్నాధపురం గ్రామపంచాయతీకి సైడ్ డ్రెయిన్ల నిర్మాణం కోసం 2.50 కోట్ల నిధులు మంజూరైనట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ(MLA Jare Adinarayana) తెలిపారు. శుక్రవారం ములకలపల్లి మండలం జగన్నాధపురం రైతు వేదికలో కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ,గాంధీ జయంతి వేడుకలు,సర్పంచ్ కుంజా వినోద్ అధ్యక్షతన ఏర్పాటైన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

భవిష్యత్తులో జగన్నాధపురం గ్రామపంచాయతీ రూపురేఖలు మారుస్తానని జగన్నాధపురంకు రెండున్నర కోట్ల తో సైడ్ డ్రైన్ మంజూరు అయిందని అదేవిధంగా పాల్వంచలోని  దమ్మపేట సెంటర్ నుంచి మందలపల్లి వరకు ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం కోసం75 కోట్ల రూపాయల వ్యయంతో ఫోర్ లైన్ రోడ్డుకు ప్రతిపాదనలు, ములకలపల్లి జగన్నాధపురం మధ్య బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో పాఠశాలలు అంగన్వాడీ స్కూల్స్ మెరుగు పడ్డాయని విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పంచాయతీలోని అన్ని వార్డులలో ప్రజలకు చేరుతున్నాయో లేదో తెలుసుకోవాలని సర్పంచ్ వార్డు సభ్యులకు సూచించారు. పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతుందని మండల అధికారితో సర్వేను నిర్వహించినట్లు తెలిపారు.జగన్నాధపురం గ్రామానికి చెందిన మడివి రాంబాబు,రేగులగుంట గ్రామానికి చెందిన కుమారిలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.కార్యక్రమంలో తహసిల్దార్ స్వాతి బిందు,ఎంపీడీవో సత్యనారాయణ,ఆర్ ఐ సోయం రాంబాబు,జిపిఓ పూజారి నవీన్ కుమార్,సెక్రటరీ సురేష్,ఏ ఈ ఓ బి. సురేష్ ఎన్ఆర్ఈజీఎస్ సత్యనారాయణ,అంగన్వాడి సూపర్వైజర్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ రావు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి జహీరుద్దీన్ స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు