హైకోర్టు తీర్పు.. కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ
18-09-2026 | 04:46pm
హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) అనర్హత వేటుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) స్పందించారు. బీఆర్ఎస్ పార్టీకి విజయం లభించిందని, అమ్ముడుపోతే అనర్హత తప్పదని మేం గతంలోనే చెప్పామని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బలాంటిదని, మిగిలిన 8 మందిపైనా కూడా అనర్హత వేటు పడేవరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఉపఎన్నిక(By-election)లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని, అధికారం ఉందని విర్రవీగితే ఎదురుదెబ్బలు తప్పవని, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని కౌశిక్ రెడ్డి చెప్పారు.