వైష్ణవ సంఘ భవనానికి స్థలం కేటాయిస్తాం: ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): వచ్చే కార్తీక మాసంలోపు శ్రీ వైష్ణవ సంఘ భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయిస్తానని మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్(Kokkirala Prem Sagar) రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్(Mancherial Municipal Corporation) పరిధిలోని కాలేజీ రోడ్డులో BMA ఫంక్షన్ హాల్(Function Hall)లో శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వైష్ణవ సమారాధాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. వైష్ణవుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ సింగతి మురళి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






