ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం

09-09-2026 | 11:52pm

సుల్తానాబాద్,(విజయక్రాంతి): కేసీఆర్(KCR) చావాలని కోరుకుంటున్నానంటూ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పెద్దపల్లి జిల్లా  సుల్తానబాధ్ మండల బీఆర్ఎస్ నాయకులు బుధవారం నిరసన చేపట్టారు. స్థానిక శాస్త్రి నగర్ వద్ద ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మనుదహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ... ప్రజా జీవితంలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.

కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అంతకుముందు వీర్ల శంకర్ శవయాత్రనిర్వహిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు మాజీ ఎంపీటీసీ సూర శ్యామ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, కొయ్యడ అరుణ్, గుర్రం శ్రీనివాసు లను శ్రీరాంపూర్ రోడ్డు వద్ద అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మరిన్ని వార్తలు