మాస్ సీఎల్‌ కోసం ఎంపీడీఓకు దరఖాస్తు చేసిన పంచాయతీ కార్యదర్శులు

10-09-2026 | 12:17am

​చేగుంట,(విజయక్రాంతి): తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్రస్థాయి సమ్మె పోరాటానికి మద్దతుగా ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో జరిగే మహాధర్నాలో పాల్గొనేందుకు  చేగుంట మండల పంచాయతీ కార్యదర్శులు(Panchayat Secretaries) మూకుమ్మడి సెలవు (మాస్ సీఎల్) నోటీసును బుధవారం చేగుంట మండల పరిషత్ కార్యాలయం(Chegunta Mandal Parishad Office)లో ఎంపీడీవో టి. చిన్నారెడ్డినికి సమ్మె వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ జేఏసీ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ సంఘీభావం తెలుపుతూ, మండలంలోని పంచాయతీ కార్యదర్శులందరూ ఒకరోజు మాస్ క్యాజువల్ లీవ్ పెట్టి హైదరాబాద్ తరలివెళ్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు