కార్మికుల ఆదాయపు పన్ను రద్దు ఏఐటీయూసీ పోరాట ఫలితమే

10-09-2026 | 12:09am

ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): సింగరేణి కార్మికుల పెరిక్స్‌పై ఆదాయపు పన్ను(Income tax) రద్దు ఏఐటీయూసీ పోరాట ఫలితమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(Singareni Collieries Workers Union) ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓసీ-2 గని(KTK OC-2 mine)లో బుధవారం నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. యాజమాన్యంతో జరిగిన చర్చల్లో కార్మికుల పెరిక్స్‌పై ఆదాయపు పన్ను రద్దుతో పాటు సొంతింటి కల నెరవేర్చేందుకు కమిటీ ఏర్పాటు, 2016–17 జేఎంఈటీ లకు ప్రమోషన్లు, మారుపేర్ల సమస్య పరిష్కారం, ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం సంభవించిన కార్మికుల కుటుంబాలకు రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించేలా ఒప్పందం కుదిరిందన్నారు.

పెండింగ్‌లో ఉన్న 149 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. కార్మికుల రక్షణ పరికరాలు, పని ముట్లు త్వరితగతిన అందించేందుకు కూడా ఒప్పందం జరిగిందన్నారు. ఇతర సంఘాలు చేస్తున్న అపోహల ప్రచారాన్ని నమ్మవద్దని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని రాజ్‌కుమార్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, పిట్ కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు