నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు
సుల్తానాబాద్, ఎలిగేడు (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ర్యాకల్దేవ్ పల్లి గ్రామంలో 200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులను సోమవారం ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు(MLA Vijayaramana Rao) పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు అని, విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలతో పాఠశాలల నిర్మాణం చేస్తున్నాడు అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లను ప్రైవేటు పాఠశాల పంపించకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపించాలి కోరారు.. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ప్రతి మండలానికి ఒకటి ప్రభుత్వం నిర్మిస్తుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన విజయ రమణారావు
సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్ లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు, అలాగే సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ భాగస్వామితో విద్యార్థులకు ఏర్పాటుచేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు...