ప్రతి డివిజన్‌ను సమానంగా అభివృద్ధి చేస్తాం

03-10-2026 | 02:26pm

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): నగరంలోని ప్రతి డివిజన్‌ను సమానంగా అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. నగరంలోని 5వ డివిజన్ ఎదిరలో యూఐడీఎఫ్ నిధులు రూ.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు(CC road construction work) శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని అన్ని వార్డులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్లు లలితా భాను చందర్, పెద్దగొల్ల నర్సింహులు, రామస్వామి, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు